📄 ePaper
Tuesday, March 24, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్సుంకులమ్మ దేవర కార్యక్రమానికి ఎమ్మెల్యే విరూపాక్షి రాక

సుంకులమ్మ దేవర కార్యక్రమానికి ఎమ్మెల్యే విరూపాక్షి రాక

📰 Generate e-Paper Clip

దేవనకొండ, మార్చ్ 23 (స్ఫూర్తి పత్రిక):
దేవనకొండ మండలంలోని గుండ్లకొండ గ్రామంలో రేపు (మార్చ్ 24) నిర్వహించనున్న గ్రామ దేవత సుంకులమ్మ దేవర కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొననున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి దేవనకొండ మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!