హోం గార్డులకు వెల్ఫేర్ ఫండ్ చెక్కుల పంపిణీ
మెడికల్ గ్రాంట్‌గా ఇద్దరికి ఆర్థిక సాయం కర్నూలు, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక): హోం గార్డుల సంక్షేమం దృష్ట్యా హోం గార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని కర్నూలులో పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కమాండెంట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ యం. మహేష్ కుమార్ ఇద్దరు హోం గార్డులకు మెడికల్ గ్రాంట్ కింద చెక్కులను అందజేశారు. కర్నూలు యూనిట్‌కు...