హోళగుందలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
– బస్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ– మార్పు కోసం ఏర్పడిన శక్తి జనసేన అని నాయకుల వ్యాఖ్యలు– పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు– పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కన్వీనర్ అశోక్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా...