📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్రైతన్న మీకోసం’ కార్యక్రమంతో రైతులకు అవగాహన

రైతన్న మీకోసం’ కార్యక్రమంతో రైతులకు అవగాహన

📰 Generate e-Paper Clip

– ఇంటింటికీ చేరి పీఎం కిసాన్ నిధులపై వివరాలు
– రైతులకు కరపత్రాల పంపిణీ
– ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

దేవనకొండ, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక):

రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం మండలంలో నిర్వహించారు. దేవనకొండ మండల కేంద్రంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో చివరి విడత నిధులు జమ చేసిన నేపథ్యంలో రైతులకు సమాచారం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, స్థానిక నాయకులు కలిసి దేవనకొండ పట్టణంలో ఇంటింటికీ వెళ్లి రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ అయ్యాయా లేదా అని వివరాలు తెలుసుకున్నారు. రైతులకు పథకం వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సక్రమంగా పొందేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని అధికారులు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న పథకాలు, వ్యవసాయానికి సంబంధించిన సేవల గురించి వివరాలు అందించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగుడు, దేవనకొండ సొసైటీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ఉచిరప్ప, రామారావు నాయుడు, ఆకుల వీరేష్, మాల బండ్లయ్య, కాకర్ల శాంత కుమార్, కొత్తపేట గోవింద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బుసల లక్ష్మన్న, రాముడు, వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓ మల్లికార్జున, విఏఓలు కళావతి, హసీనా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!