రైతన్న మీకోసం’ కార్యక్రమంతో రైతులకు అవగాహన

– ఇంటింటికీ చేరి పీఎం కిసాన్ నిధులపై వివరాలు– రైతులకు కరపత్రాల పంపిణీ– ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం దేవనకొండ, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం మండలంలో నిర్వహించారు. దేవనకొండ మండల కేంద్రంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో చివరి విడత నిధులు జమ చేసిన నేపథ్యంలో...