– ఘనంగా జయంతి నిర్వహణకు సన్నాహాలు ప్రారంభం
ఎమ్మిగనూరు, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక):
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మిగనూరు పట్టణంలో జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 14న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం స్థానిక కెవిపిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశం కమిటీ కన్వీనర్ యస్. దేవ సహాయం, కోర్ కమిటీ సభ్యులు ఎల్.ఐ.సి. పరిగెల భాస్కర్, జి. ఆనంద్ చైతన్య మాదిగ, కదిరికోట ఆదెన్న, ఆరెకంటి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది.జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఎర్రకోట గ్రామానికి చెందిన డా. సంకుల మహాలింగప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్లుగా హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ యం. సురేష్ వరప్రసాద్, కలుగొట్ల గ్రామానికి చెందిన మాల రాజా రమేష్‌లను ఎంపిక చేశారు.అదేవిధంగా కమిటీ సభ్యులుగా డా. డి. బాలయ్య, ఎరుకల కృష్ణ, రుద్రాక్షల పెద్దయ్య, యస్. రాజు, ఉసేని, కనకవీడు రాజు, రుద్రాక్షల దస్తగిరి, గంజహళ్లి మహదేవ్, సుమాల అంతోని, ముగతి నరసన్న, గుడికల్ స్వామి దాసు, సప్పోగు తిమ్మన్న, గంధాలం దుబ్బన్న, సుమాల రాజు, అల్వాల నాగరాజు, కరుణాకర్ తదితరులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షుడు హాలహర్వి దావీదు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, ఆర్ అండ్ బి సూపర్వైజర్ ప్రభు కుమార్, మాజీ కౌన్సిలర్ ఇప్పే నరసప్ప, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అంబేద్కర్ జయంతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా, వేలాది మంది పాల్గొనేలా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

