అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఎమ్మిగనూరులో కమిటీ ఎన్నిక
– ఘనంగా జయంతి నిర్వహణకు సన్నాహాలు ప్రారంభం ఎమ్మిగనూరు, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మిగనూరు పట్టణంలో జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 14న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం స్థానిక కెవిపిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశం కమిటీ కన్వీనర్ యస్. దేవ సహాయం, కోర్ కమిటీ సభ్యులు ఎల్.ఐ.సి. పరిగెల భాస్కర్, జి. ఆనంద్ చైతన్య...