sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:52 am Digital Edition : SPHOORTI PATRIKA

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ నగరంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వాతంత్ర సమర యోధులు వకీల్ భీమయ్య, వేదవతి, శ్యామలమ్మ లను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.