📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి…. సిఐటియు జిల్లా అధ్యక్షులు...

ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి…. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ

📰 Generate e-Paper Clip

ఫిబ్రవరి నెల 12వ తేదీన లేబర్ కోడ్ ల కు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కు వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ లు కార్మిక వర్గాన్ని కోరారు
శనివారం నాడు స్థానిక సీఐటీయూ కార్యాలయం నందు సంఘం మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పి.ఎస్ రాధాకృష్ణ, వీర శేఖర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఇప్పటికే కార్మికులు పని భద్రత, కనీస వేతనాలు ఈఎస్ఐ,పిఎఫ్, ఇన్సూరెన్స్ లాంటి చట్టాలు అమలు కాకుండా కార్మికుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నారని తెలిపారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు వల్ల కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా హరించి వేసే ప్రమాదం ఉందని వారు తెలిపారు కనీస వేతనాలు చట్టం బోనస్ చట్టం, ఈఎస్ఐ, పీఎఫ్ చట్టం కోల్పోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు కోట్ల సంఖ్యలో ఉన్న అసంఘటితరంగా కార్మికులకు ప్రభుత్వం సమగ్రమైన కార్మిక చట్టం తీసుకురావడం ద్వారా వారికి చేయూతనివ్వాలని వారు డిమాండ్ చేశారు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం కాపాడుకోవాలి కానీ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మకూడదని ఇది దేశ సంపదను నాశనం చేస్తుందని వారు పేర్కొన్నారు ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలను గడుపుకుంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో
కార్మికులకు అండగా నిలవాలని అలా కాకుండా కార్పొరేట్ సంస్థల సేవలో ప్రభుత్వాలు తరిస్తున్నాయని పేర్కొన్నారు అలాగే 2005 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టానికి తూట్లు పొడిచి వికసిత్ భారత్ రాంజీ పేర్లతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తుందని దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఎంతో కొంత ఉపాధి పనులు చేసు కుంటున్న పేద ప్రజలకి ఈ చట్టం వల్ల తీరని అన్యాయం జరుగుతుంద ని వారు తెలిపారు , మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోని కొనసాగించాలని కార్మికుల హక్కులు చట్టాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు ఫిబ్రవరి 12వ తేదీన జరుగు సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగేష్ ,రంగన్న, మరియు మహేంద్ర ,రంగడు, మహేష్ ,రాము ,కాంతయ్య, సోమశేఖర్, రాయుడు, రాముడు, కుమార్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!