రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఆధ్యాత్మిక ఉత్సవం
స్వామి–అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
రథోత్సవానికి నేతలు, ప్రజల భారీ హాజరు
గ్రామీణ ప్రాంతంలో భక్తి సందడి
దేవనకొండ, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వెలసిన లక్ష్మీ సమేత కౌలుట్ల చెన్నకేశవ స్వామి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ రథోత్సవానికి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఆహ్వానం మేరకు ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి స్వామి,అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి వేడుకలను తిలకించారు. అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయంలో నిర్వహించిన రథోత్సవం భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో దేవనకొండ మాజీ ఎంపీపీ కప్పట్రాళ్ల రామచంద్రనాయుడు, టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి ఉచిరప్ప, ఆకుల వీరేష్, ఆలూరుదిన్నె రామారావు, మల్లెపల్లె రంగడు, రాజశేఖర్ గౌడ్, నెల్లిబండ మల్లికార్జునతో పాటు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.భక్తి, సంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ రథోత్సవం విజయవంతంగా ముగిసింది.

