📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

📰 Generate e-Paper Clip

 

  •  ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన అనుభవజ్ఞుడైన నాయకుడు

అమరావతి, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక):

మాజీ కేంద్ర మంత్రి, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. ఆయన మరణవార్త రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.కావూరి సాంబశివరావు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికై ప్రజాప్రతినిధిగా సేవలందించారు. 1984, 1989, 1998 సంవత్సరాల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన జాతీయ స్థాయిలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో కేంద్ర ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారు.రాజకీయ జీవితం పాటు ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ఆయన పేరు నిలిచింది. ఆయన మరణంపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!