📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్గ్రామ దేవర ఉత్సవాల్లో భాగంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

గ్రామ దేవర ఉత్సవాల్లో భాగంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

📰 Generate e-Paper Clip

పెద్దహ్యట గ్రామంలో యువతకు క్రీడా పోటీలు
– ఈ నెల 21 వరకు జట్ల నమోదు
– 22న ప్రారంభ మ్యాచ్‌లు, 23న ఫైనల్
– విజేతలకు నగదు బహుమతులు

హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):

హోళగుంద మండల పరిధిలోని పెద్దహ్యట గ్రామంలో గ్రామ దేవతలు శ్రీ బంగారమ్మ దేవి, కొల్లపురమ్మా దేవి, సుంకాలమ్మ దేవిల దేవర ఉత్సవాల సందర్భంగా యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కబడ్డీ పోటీలలో పాల్గొనదలచిన జట్లు ఈ నెల 21వ తేదీ లోపు తమ పేర్లను నిర్వాహకుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. పోటీలు ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. అదే రోజు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించగా, మార్చి 23వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని నిర్వాహకులు వివరించారు.

టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.20,000ను టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గోవిందు గౌడ్ అందించనుండగా, రెండవ బహుమతిగా రూ.15,000ను టిడిపి నాయకుడు ఏఎన్‌బిఎస్ శివప్రకాష్, మూడవ బహుమతిగా రూ.10,000ను సి. మంజునాథ్ అందించనున్నట్లు తెలిపారు.

ఈ పోటీలకు ఎంట్రీ ఫీజుగా ఒక్కో జట్టు నుంచి రూ.700 వసూలు చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ పోటీలు పెద్దహ్యట గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి మైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇతర వివరాల కోసం 7093144891, 8297491992, 6300024892, 8688858934 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి పలు స్పాన్సర్లు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!