📄 ePaper
Sunday, September 13, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు సర్వేపల్లి ఆదర్శం - ఎఫ్ఆర్ హైస్కూల్లో ఘనంగా గురుపూజోత్సవం

విద్యార్థులకు సర్వేపల్లి ఆదర్శం – ఎఫ్ఆర్ హైస్కూల్లో ఘనంగా గురుపూజోత్సవం

📰 Generate e-Paper Clip

దేవనకొండ: మండల కేంద్రమైన దేవనకొండలోని ఎఫ్ఆర్ హైస్కూల్లో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉచ్చిరప్ప అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి. రఘునాథ్ మాట్లాడుతూ, దివంగత భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని అన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ భవిష్యత్తును నూతన మార్గంలో నిర్మించాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజం ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవప్రదంగా చూడాలని అన్నారు.

తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులని, అనంతరం ఉపాధ్యాయులు, సమాజం వారి వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షబానా, లక్ష్మి, స్రవంతి, ఝాన్సీ, భవాని, సాహిదా, రంగస్వామి, గోపాల్, రమేష్, గోపాలు, ఎస్ఎండి భాష, విజయలక్ష్మి, మహేశ్వరి, ఉషారాణి, మున్నీ, శాంతి, మౌనిక, సంధ్య, జహీదా, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!