📄 ePaper
Sunday, September 13, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్

మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్

📰 Generate e-Paper Clip

ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ

ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 500 రెట్లు ఆదాయం వస్తుందని ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు

ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకున్న ఊర్మిళ

డిసెంబర్ 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించి 2 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా నమ్మించిన సైబర్ నేరగాళ్లు

విత్ డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఈ నేరానికి పాల్పడ్డ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!