📄 ePaper
Tuesday, March 24, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్హోం గార్డులకు వెల్ఫేర్ ఫండ్ చెక్కుల పంపిణీ

హోం గార్డులకు వెల్ఫేర్ ఫండ్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

  •  మెడికల్ గ్రాంట్‌గా ఇద్దరికి ఆర్థిక సాయం

కర్నూలు, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక):

హోం గార్డుల సంక్షేమం దృష్ట్యా హోం గార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని కర్నూలులో పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కమాండెంట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ యం. మహేష్ కుమార్ ఇద్దరు హోం గార్డులకు మెడికల్ గ్రాంట్ కింద చెక్కులను అందజేశారు. కర్నూలు యూనిట్‌కు చెందిన హోం గార్డు పి. సురేష్ కుమార్‌కు రూ.10,000, మహిళా హోం గార్డు వి. భారతి‌కు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.

హోం గార్డులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇంచార్జ్ ఎస్.ఎల్. కాంతరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కె. మాధవి రాణి, పోలీసు సిబ్బంది, హోం గార్డులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!